- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా @ 314
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా సత్ఫలితాలివ్వడం లేదు. రోజురోజుకీ కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతోంది. అయితే గత రెండు రోజుల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు పరిశీలిస్తే.. కరోనా కట్టడికి వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 314 మంది కరోనా బారిన పడ్డారు.
తాజాగా, గుంటూరు జిల్లాలో 8 కేసులు కొత్తగా నమోదు కాగా, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గత వారం రోజులుగా పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు అకస్మాత్తుగా తగ్గడం ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు ఈ రోజు 10 కేసులు నమోదు కావడం కొంత ఊరటనిచ్చే అంశమే. మరోవైపు కరోనా కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 43 కేసులు, గుంటూరు జిల్లాలో 41 కేసులు, కృష్ణా జిల్లాలో 29, కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 24, పశ్చిమగోదావరి జిల్లాలో 21, విశాఖపట్టణం జిల్లాలో 20, చిత్తూరు జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో కేవలం 6 కేసులు నమోదయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Tags: coronavirus, covid-19, andhra pradesh, health department, arogyaandhra