జోగిపేటలో మరో కరోనా కేసు నమోదు

by vinod kumar |
జోగిపేటలో మరో కరోనా కేసు నమోదు
X

దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. మూడు రోజుల క్రితం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన సతీమణికి కూడా కరోనా టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్‌గా వచ్చినట్టు తాలెల్మ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంధ్యారాణి ప్రకటించారు. ఉపాధ్యాయుడి తండ్రికి, స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రి డాక్టర్‌లకు నెగిటివ్‌ వచ్చిందని, మరో ఇద్దరికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుడి సతీమణి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలో హోంక్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story