- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా నెగిటివ్ రిపోర్టుంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ మరో నాలుగు రోజుల్లో తేలనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి ఏజెంట్లు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి. లేకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రూఫ్స్ సమర్పించాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
ఈ ఆధారాలను 48 గంటల ముందే ఎన్నికల అధికారులకు చూపించాలి. లేదంటే అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించి.. నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాతే వారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని ఈసీ వెల్లడించింది. 48 గంటల ముందు కంటే చేయించిన రిపోర్టును అనుమతించరు. అంతేగాక కౌంటింగ్‌కు వచ్చే ఏజెంట్లకు సంబంధించిన వివరాలను మూడు రోజుల ముందే సమర్పించాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలను బ్యాన్ చేయాలని మంగళవారం ఆదేశించిన ఈసీ.. బుధవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.