- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులకు కరోనా నెగెటివ్
దిశ, న్యూస్‌బ్యూరో: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇప్పటికే 11రోజుల క్వారంటైన్ పూర్తయినందున మరో నాలుగు రోజులపాటు ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు. నెగెటివ్ వచ్చినందున హోమ్ క్వారంటైన్ సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు జర్నలిస్టులు తెలిపారు. గద్వాల మున్సిపల్ టీఆర్ఎస్ బాధ్యుడొకరు ఇటీవల చనిపోగా అంత్యక్రియల్లో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ ఛైర్మన్ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మృతుని ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. అయితే అప్పటికి ఒక రోజు ముందు ఎమ్మెల్యే నిర్వహించిన మీడియా సమావేశానికి పదకొండు మంది హాజరయ్యారు. వారిలో నలుగురిని జిల్లా వైద్యాధికారులు క్వారంటైన్‌కు తరలించగా మిగిలిన ఏడుగురు స్వచ్ఛందంగా క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. వీరంతా 11 రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా వైద్య కళాశాల పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హాస్టల్ భవనంలో క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ రెండు రోజుల క్రితం నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ లేదని రిపోర్టు వచ్చింది.
క్వారంటైన్‌లో ఉన్న వీరికి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ టు టౌన్ పోలీసులు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 54, ఐపీసీలోని 505(ఐ-1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదిగా అసత్య ప్రచారం చేసినందుకు వీరిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని జర్నలిస్టులు తెలిపారు.
Tags: Telangana, Corona, Journalists, Negetive Report, FIR