కరోనా మార్గదర్శకాలు గడువు పొడిగింపు

by vinod kumar |
కరోనా మార్గదర్శకాలు గడువు పొడిగింపు
X

న్యూఢిల్లీ: డిసెంబర్ ఆఖరుతో ముగియనున్న కొవిడ్-19 గైడ్‌లైన్స్‌ను వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటపడిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. గత కొద్దిరోజులుగా దేశంలో యాక్టివ్, కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయని, కానీ, యూకేలో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి రావడం, ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కంటైన్‌మెంట్ సహా ఇతర ఆంక్షలను అమలు చేయాలని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది.

కొవిడ్-19 వేగంగా రూపాంతరం చెందుతుండటంతో ఇప్పటికే అమలులో ఉన్న మార్గదర్శకాల గడువును పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్‌మెంట్ జోన్ల గుర్తింపును కొనసాగించాలని, ఆయా జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కోరింది. ఏదేమైనా దేశంలో కొత్త కేసుల నమోదు, కరోనా మరణాలు తగ్గుతుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed