అంతరిక్షానికి కూడా పాకిన కరోనా దెబ్బ

by Harish |
అంతరిక్షానికి కూడా పాకిన కరోనా దెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్:

కేవలం భూమ్మీదే కాదు కరోనా వైరస్ ప్రభావం అంతరిక్షానికి కూడా పాకింది. అలాగని అంతరిక్షంలో పనిచేస్తున్న వ్యోమగాములకు వైరస్ సోకిందనుకోకండి. అలాంటిదేం లేదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వారు తమ నాలుగు ఆపరేషన్లలో డేటా గేథరింగ్‌ని నిలిపివేసింది.

వైరస్ తాకిడి కారణంగా ఈఎస్ఏ వారి జర్మనీలోని డర్మ్‌స్టాడ్ మిషన్ కంట్రోల్ గ్రౌండ్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడంతో అంతరిక్షంలో ఆపరేషన్లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా భయాలు తగ్గిన తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్లు తిరిగి ప్రారంభిస్తామని అప్పటివరకు నిలిపివేయక తప్పదని ఈఎస్ఏ ప్రకటించింది. ఈ క్రమంలో క్లస్టర్, ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్, మార్స్ ఎక్స్‌ప్రెస్, సోలార్ ఆర్బిటార్ మిషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. నాసా వారు కూడా తమ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వర్క్ ఫ్రం హోం ప్రకటించిన సంగతి తెలిసిందే.

tags : Corona, COVID 19, Space, Isolation, Work from home, European space station, mission

Advertisement

Next Story