కరోనా కంటే రైల్వే ఫ్లాట్ ఫామ్ టికెట్స్ భయపెడుతున్నాయి

by srinivas |
కరోనా కంటే రైల్వే ఫ్లాట్ ఫామ్ టికెట్స్ భయపెడుతున్నాయి
X

వైజాగ్, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫామ్‌లు కరోనా కంటే ఎక్కువగా ప్రయాణీకులను భయపెడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణీకుల జేబులకు షాక్ కొడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 250 రైల్వే స్టేషన్ల ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలను పెంచింది. పెంచడమంటే సాధారణంగా రూపాయో రెండు రూపాయలో కాదు.. రైల్వే ఫ్లాట్ ఫాంలోకి ఎంటరవ్వాలంటే 50 రూపాయల ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని వెళ్లాలి. ఈ ధరలు తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు అమలులో ఉంటాయని రైల్వే విభాగం ప్రకటించింది. ఈ ధరలతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు కూడా ఈ ధరలు వర్తించనున్నాయి.

tags : coronavirus, railways, train platform, indian railway, platform


👉 Read Disha Special stories


Next Story