తెలంగాణలో కరోనా @ 2,795

by Anukaran |
తెలంగాణలో కరోనా @ 2,795
X

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్యారోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నా.. అందుకు భిన్నంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24గంటల్లో 2,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి ఒక్కరోజే 8 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483కు చేరుకుంది.

గడచిన 24 గంటల్లో 872 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు రికవరీ అయిన మొత్తం బాధితుల సంఖ్య 86,095కు చేరుకుంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 788కు చేరుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ప్రకటించింది.

Next Story

Most Viewed