తెలంగాణలో నిన్న ఒక్కరోజే భారీగా కేసులు

by Anukaran |
తెలంగాణలో నిన్న ఒక్కరోజే భారీగా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏ మాత్రం ఆగడంలేదు. నిన్నమొన్నటి వరకు 2 వేల వరకు నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు 3 వేల వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,924 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,090కు చేరింది. ఇందులో 90,988 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 31,284 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 818 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. కాగా, తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-461, ఖమ్మం-181, కరీంనగర్-172 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement
Next Story

Most Viewed