- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనా @ 14,595
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 704 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన అయిదు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా కేవలం ఏపీకి చెందిన కేసులు 648 అని ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 12202 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో మొత్తం ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,511కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కరోనాకి 7,897 మంది చికిత్స పొందుతున్నారు.