సంగారెడ్డి జైళ్లో కరోనా టన్నెల్

by Shyam |
సంగారెడ్డి జైళ్లో కరోనా టన్నెల్
X

దిశ, మెదక్: కరోనా కట్టడికి ఖైదీలు నడుం బిగ్గించారు. 12 గంటల పాటు శ్రమించి కరోనా వైరస్ యాంటీ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా కారాగారంలో కానిస్టేబుల్ లింగమూర్తి , జైపాల్ పర్యవేక్షణలో నలుగురు ఖైదీలు ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఖైదీలు, పోలీసులు, సందర్శకులు టన్నెల్‌లో వెళ్లేటప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తారు. దీంతో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు. జిల్లా కారగారంలో ఏర్పాటు చేసిన ఇలాంటి టన్నెల్‌ను జిల్లా ఎక్కడైనా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జిల్లా జైలు పర్యవేక్షకుడు శివకుమార్ గౌడ్ తెలిపారు.

Tags: corona, tunnel, medak, ts newscorona anti tunnel in sangareddy district jail

Next Story

Most Viewed