- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కుంటలో పోలీసుల సెర్చింగ్.. భారీగా బైకులు స్వాధీనం

X
దిశ, ముధోల్: ఏఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో భైంసా పట్టణంలోని కుంట ఏరియా, నాయబది ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నేరాల నివారణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 105 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, 2 కార్లు, రూ. 1000 విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు, రూ. 1300 విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. పట్టణంలో ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సెర్చ్ లో 10 మంది ఎస్సైలు, 100 పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Next Story