- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ రైడ్స్‌పై తాప్సీ లవర్ రిక్వెస్ట్.. నా చేతుల్లో ఏమీ లేదన్న కేంద్రమంత్రి!
దిశ, సినిమా: బాలీవుడ్ నటి తాప్సీతో సహా పలువురు ఫిల్మ్ మేకర్స్ ఇళ్లలో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ బాయ్ ఫ్రెండ్ మాథియాస్ బో కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టాడు. ‘కాస్త గందరగోళంలో ఉన్నాను..ఇండియాలోని గొప్ప అథ్లెట్లకు ఫస్ట్ టైమ్ కోచ్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదే సమయంలో ఐటీ(ఇన్‌కమ్ ట్యాక్స్) డిపార్ట్‌మెంట్ తాప్సీ ఇంటిపై రైడ్ చేసి తన(తాప్సీ) కుటుంబాన్ని స్ట్రెస్‌కు గురిచేస్తోంది. ముఖ్యంగా తన అమ్మానాన్నలు అనవసరంగా స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఈ సందర్భంలో వారి రక్షణకు కిరణ్ రిజిజు మీరు ఏమైనా చేయొచ్చుగా’ అంటూ కేంద్రమంత్రికి రిక్వెస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందదించిన మినిస్టర్ రిజిజు ‘ఇక్కడ సుప్రీం ‘లా ఆఫ్ ది ల్యాండ్’ దానికి కట్టుబడి ఉండాలి. విషయం మన ఇద్దరికి మించినది. మనం మన ప్రొఫెషనల్ డ్యూటీస్‌కు కట్టుబడి ఉండాలి’ అని రిప్లై ఇచ్చాడు.
Law of the land is supreme and we must abide by that. The subject matter is beyond yours and my domain. We must stick to our professional duties in the best interest of Indian Sports. https://t.co/nIIf5C8TXL
— Kiren Rijiju (@KirenRijiju) March 5, 2021