దేత్తడి.. ఏంటిది?

by Jakkula Samataha |
దేత్తడి.. ఏంటిది?
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేం దేత్తడి హారిక చుట్టూ టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్ వివాదం తిరుగుతూనే ఉంది. ఇంతకు ఆమెను ఉంచారా?.. లేదా తొలగించారా? అనేది కూాడా అర్థం కావడం లేదు. టూరిజం ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా ప్రకటన ఒకలా ఉండగా.. టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటన మరొలా ఉంది. దీంతో దేత్తడి హారికను ఈ వివాదం చుట్టుముట్టింది.

మహిళా దినోత్సవం రోజున దేత్తడిని తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించగా.. మంత్రికి, సీఎంవో అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎలా నియమిస్తారంటూ టూరిజం డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తాపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దేత్తడిని తొలగించినట్లు వార్తలొచ్చాయి. కానీ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని, దేత్తడి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతుందని శ్రీనివాస్ గుప్తా మీడియాకు వెల్లడించారు.

ఈ వివాదంపై తాజాగా టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. దేత్తడి హారిక ఎవరో తెలియదని, ప్రస్తుతం ఎన్నికల బిజీలో ఉన్నానన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సెలబ్రిటీని నియమిస్తామని, సీఎం అనుమతి లేకుండా నియమించినవారిపై చర్యలు తప్పవన్నారు.

Advertisement

Next Story