- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీసీజీ లైఫ్ సైన్సెస్ ఉద్యోగులకు బోనస్‌లు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులకు అండగా ఉంటూ వేతనాల కోత, ఉద్యోగాల తొలగింపు చేపట్టని జాబితాలో మరో కంపెనీ చేరింది. ప్రముఖ కాంట్రాక్ట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ సేవల సంస్థ టీసీజీ లైఫ్ సైన్సెస్ ఉద్యోగులకు బోనస్‌లు, కొత్త నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో 15 శాతం నియామకాలను పెంచాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే, కరోనా సమయంలో అనేక ఒత్తిడుల మధ్య ఉద్యోగులకు ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు బోనస్‌లను విడుదల చేయనున్నట్టు టీసీజీ లైఫ్ సైన్సెస్ ప్రతినిధి ఒకరు వివరించారు. ఇప్పటికే పూర్ణేంద్ర చటర్జీ గ్రూ ఆధ్వర్యంలో కంపెనీలో ఉద్యోగుల పనితీరుపై మదింపు ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తయారీ యూనిట్‌తో పాటు, కోల్‌కతాలోని ఆర్ అండ్ డీ కేంద్రంలో ఉన్న 1500 మంది ఉద్యోగులకు వంద శాతం వార్షిక బోనస్‌లను విడుదల చేశామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కొత్త నియామకలా ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. ఇదే క్రమంలో డ్రగ్ పరిశోధనలో టీసీజీ కంపెనీ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నట్టు, ఉద్యోగుల భద్రత విషయంలో అన్ని రకాల నియమాలను అమలు పరుస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగులకు మూడు షిఫ్టుల పని విధానాన్ని అమలు పరుస్తున్నట్టు చెప్పారు.