జలవనరుల శాఖలో 26 పోస్టుల కొనసాగింపు

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: సాగునీటి ప్రాజెక్టుల్లో భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్డీసీ) పరిధిలో 26పోస్టులను ఏడాది పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 24ఎస్డీసీ యూనిట్ల పరిధిలో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మూడు స్పెషల్ డిప్యూటీ తాసీల్దార్లు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్, మూడు సీనియర్ అసిస్టెంట్లు, ఒక డిప్యూటీ ఇన్స్ పెక్టర్ అఫ్ సర్వే, రెండు జూనియర్ అసిస్టెంట్లు, రెండు టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్లు, నాలుగు అటెండర్లు, ఒక్కో స్వీపర, వాచ్‌మెన్, రెండు సర్వేయర్, ఛైన్‌మెన్ పోస్టులను కలుపుకుని మొత్తం 23 పోస్టులను ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటుగా నల్లగొండ ఎస్డీసీ పరిధిలో రెండు సీనియర్ అసిస్టెంట్లు, ఒక స్పెషల్ రెవిన్యూ ఇన్స్ పెక్టర్, యాదాద్రి భువనగిరి ఎస్డీసీ పరిధిలో రెండు స్పెషల్ రెవిన్యూ ఇన్స్ పెక్టర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, కరీంనగర్ ఎస్డీసీ పరిధిలో ఒక డ్రైవర్ పోస్టును కూడా ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story