దేశానికే ఆదర్శంగా గచ్చిబౌలి హాస్పిటల్ నిర్మాణం

by Sridhar Babu |

దిశ, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో గచ్చిబౌలిలో నిర్మిస్తున్న హాస్పిటల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రిని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రోజురోజుకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైరస్‌ను అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన హాస్పిటల్ విశాలంగా సౌకర్యవంతంగా అన్ని వసతులతో అద్భుతంగా ఉందన్నారు. మనం ఎవరికీ తీసిపోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించిందని పుట్ల శ్రీనివాస్ కొనియాడారు.

tag: Putla Srinivas, visit, Construction, Gachibowli Hospital

Next Story