- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీపీసీసీ మార్పుపై హైకమాండ్ తర్జన భర్జన
టీపీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులెత్తేస్తున్నాడు. కానీ ఆ పదవిని మాకు ఇవ్వండంటూ పోటీపడుతున్నారు సీనియర్ నేతలు. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడతామంటూ ముగ్గురు సీనియర్ నాయకులు వారివారి దారిలో అధిష్టానం దగ్గర ఫైరవీలు చేసుకుంటున్నారు. అధిష్టానం మాత్రం టీపీసీసీ పదవి మార్పుపై నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జన పడుతోంది. పదవి వద్దు అన్నవారిని తొలిగించకుండా. పదవి కావాలన్నవారికి ఇవ్వకపోవడం వెనుక హైకమాండ్ మర్మం అర్థం కావడంలేదు. అదే ఇప్పడు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
పీసీసీ కుర్చీ కోసం సీనియర్ నాయకులు మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతున్నారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం అంతకన్నా పెద్ద గేమ్ ఆడుతోంది. సమయం కోసం ఎదురుచూస్తోంది. వద్దంటున్న ఉత్తమ్‌ను పక్కన పెట్టడం లేదు.. కావాలనుకుంటున్నవారికి అవకాశం ఇవ్వడం లేదు. ఇంతకూ పీసీసీ మార్పుకు అధిష్టానం డిసైడయ్యిందా? ఇదే ఆ పార్టీ నాయకులను టెన్షన్ పెడుతోంది. అందుకే గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో చర్చ చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ అదిగో కొత్త ప్రెసిడెంట్ అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఏదీ వాస్తవరూపం దాల్చడం లేదు. పీసీసీ చీఫ్ మార్పుపై పార్టీ అధిష్టానం తర్జభర్జన పడుతోందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.
ఇప్పటికే ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా త్వరలో పీసీసీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మాట చెప్పి దాదాపు నాలుగైదు నెలలయింది. అధిష్టానం మాత్రం కొత్త పీసీసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీసీసీ మార్పు ఉంటుందా లేదా అనేది ఆ పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పార్టీ ఇంచార్జ్ కుంటియా సైతం ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష మార్పుపై ఎలాంటి వాఖ్యలూ చేయలేకపోతున్నారు. కనీసం సంకేతాలు కూడ ఇవ్వడంలేదు.
సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వి హనుమంతరావులు మాత్రం ఢిల్లీ స్థాయిలో తమదైన శైలిలో పైరవీలు చేసుకుంటున్నారు. పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ బలహీనపడిందన్న విషయం ఆ పార్టీకి తెలియందేమీ కాదు. ఒక్కో నేత పార్టీని వీడిపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఉనికి కాపాడుకోవడానికే నానా తంటాలు పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో పీసీసీ మార్చడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్న భావనలో అధిష్ఠానం ఉన్నట్టు ఆ పార్టీ వర్గీయులే చెవులు కొరుక్కుంటున్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు పీసీసీ అధ్యక్షపదవికి బలమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంధర్భంలో పీసీసీ మార్పుతో పార్టీలో మరో మారు వర్గపోరు బట్టబయలవుతోందేమో అన్నది అధిష్టానం ఆందోళన. అందుకే పీసీసీ మార్పు ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ వేసినట్టు ఆ పార్టీ నాయకుల్లో చర్చ ఒక రేంజ్‌లో జరుగుతోంది. పీసీసీ పదవి కోసం పోటిలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరికి పదవి ఇచ్చినా పార్టీకి మిగిలిన ఇద్దరు దూరమవుతారేమో అనే భయం అధిష్టానాన్ని వెంటాడుతోంది. ఇదే జరిగితే రాష్ర్టంలో కాంగ్రెస్ నిలువునా చీలినా ఆశ్చర్యపోవాల్సింది లేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.
ఇప్పటికే కొన ఊపిరితో వున్న పార్టీకి ఈ పరిణామలు తోడైతే పార్టీ మరింత ఇరుకటంలో పడే అవకాశం ఉందన్న ఆలోచనలతో అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్ అల్లంత దూరం పోతున్నప్పటికీ హైకమాండ్ మాత్రం పట్టిపట్టి కుర్చీలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. అలాగని పీసీసీ మార్పు జరగకపోతే పార్టీకి కొత్త ఊపు రాదంటున్నారు మరికొందరు నేతలు.