- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్ఎస్ సర్కార్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
దిశ, జగిత్యాల: తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం జగిత్యాల మండలంలోని పోరండ్ల గ్రామ సర్పంచ్ సంధ్యారాణి ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి బిశ్వాల్ కమిటీ లక్షా 90 వేల ఖాళీలు ఉన్నాయని నివేదిక సమర్పించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను సైతం పెడచెవిన పెడుతోందని అన్నారు. విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పోరండ్ల గ్రామానికి చెందిన యువకులు చేరడం కాంగ్రెస్ విజయానికి సూచిక అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, కౌన్సిలర్ జీవన్, మాజీ కౌన్సిలర్ రమేష్ రావు, రాజేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.