- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

దిశ, మహాదేవపూర్: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మహాదేవ పూర్ మండలంలోని 36 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మండలంలో నిర్మించిన వైకుంఠధామాలకు రోడ్డును నిర్మించాలని, అవసరమైన ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కు పంపాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణమైన సీసీ రోడ్లకు రోడ్డు పక్కన సైడ్ బర్ములు నింపాలని సిబ్బందికి సూచించారు. మండలంలో కరోనా వ్యాక్సినేషన్ ను పూర్తి చేయించాలని మహదేవ పూర్ ఆసుపత్రి పర్యవేక్షకులు చంద్రశేఖర్ కు సూచించారు. మండల రెవెన్యూ కార్యక్రమం కార్యాలయ భవనాలు వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మహాదేవపూర్ జెడ్పీటీసీ అరుణ, మహాదేవపూర్ ఎంపీపీ రాణీ బాయి, ఎంపీటీసీ సుధాకర్, ఎంపీడీవో శంకర్, ఎమ్మార్వో శ్రీనివాస్ ఉన్నారు.