- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్లు మూసివేయడం మంచిదే.. కానీ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యాసంస్థలు మూసివేయం సరైన నిర్ణయమేనని, కానీ వసూలు చేసిన ఫీజుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. వేలాది రూపాయలు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను హత్య చేశారని, ఇది కూడా క్రిమినల్ చర్యే అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆర్థిక సంక్షేభంలో ఉన్నట్లు ప్రకటించిందని, అలాంటిది ప్రజలు ఆర్థిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని, ఈ దుస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు ఫీజులు వసూలు చేసి, పది రోజులు కూడా నడపకుండా పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు, తల్లిదండ్రులకు రోగాలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం పరిష్కారం చూపించాలని కోరారు. చెల్లించిన ఫీజుల్లో కనీసం సగమైనా తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. కరోనా ఇప్పటితో పోదని, ఇంకో ఏడాది ఉన్నా ఆశ్యర్యం లేదన్నారు. మళ్లీ లాక్డౌన్ వచ్చే పరిస్థితులు లేకుండా ముందుగా బార్లు, మద్యం దుకాణాలు, థియోటర్లు, పార్కులు మూసివేయించాలని సూచించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం రావడం లేదని, నియోజకవర్గ సమస్యలు చెప్పే చాన్స్ లేదని తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ముందుకు పడలేదని, ఇండ్లు ఇవ్వలేదని చెప్పారు. సంగారెడ్డి సెగ్మెంట్ అభివృద్ధికి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.