- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా రాస్తారోకో

దిశ, మెదక్
రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ.. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆయన నియోజకవర్గ పరిధిలో పట్టణగోస కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే కేటీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన ఆయనను అరెస్ట్ చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా చేసిన అక్రమాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బర్మా రామచంద్రం , అంజి రెడ్డి , పుల్లూరు రాములు , చిలకం యాదగిరి , ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
tags;congress leaders protest, medak, mp revanth reddy