టీఆర్‌ఎస్ హయాంలో యూనివర్సిటీలు నిర్వీర్యం

by Shyam |
టీఆర్‌ఎస్ హయాంలో యూనివర్సిటీలు నిర్వీర్యం
X

దిశ, న్యూస్ బ్యూరో :
టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.ఈ చర్యల వలన బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటు పరం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. అనంతరం వి హనుమంతరావు మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ భూములను తులసి కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర పెద్దల అండ చూసుకుని భూములను మింగే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కేంద్ర సర్వే డిపార్ట్మెంట్‌తో యూనివర్సిటీ భూములను తిరిగి సర్వే చేయించాలని గవర్నర్‌ను కోరినట్లు వారు తెలిపారు.

Advertisement

Next Story