- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉప ముఖ్యమంత్రిగా తొలగించినా సోయి రాలేదు.. రాజీనామా చేయ్’
దిశ, స్టేషన్ ఘన్ పూర్: ‘రాజయ్య.. రాజీనామా చేయండి. అప్పుడే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది’ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ చిలువేరు కృష్ణమూర్తి స్థానిక ఎమ్మెల్యే రాజయ్యను డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే నాడు నాగార్జునసాగర్, నేడు హుజూరాబాద్‌లో కొత్త పథకాలు తీసుకొచ్చి అమలుకు శ్రీకారం చుడుతున్నారని గుర్తుచేశారు. అందులో భాగంగానే ‘దళితబంధు’ పథకం అన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గమైన స్టేషన్ ఘన్ పూర్ దళితులు బాగుపడాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి లాంటి హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ రాష్ట్రమంతా అమలు చేస్తామంటే నమ్మి మోసపోవడమే తప్ప మరోటి కాదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా.. సోయి రాని రాజయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసమైన రాజీనామా చేసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ‘దళితబంధు’ అమలు కోసం నియోజకవర్గంలోని దళితుల అందరి చేత దరఖాస్తులు చేయించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఇందుకోసం కార్యకర్తలను సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు శిరీష రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సొసైటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జగదీష్, చంద్రారెడ్డి, ఎల్లయ్య, గట్టు మల్లు, సర్వర్, మంచాల ఎల్లయ్య, పాపయ్య, నాగయ్య, కోటి, ఓన్లీ నాయక్, కుమార్, రమేష్ నాయక్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.