- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మినిస్టర్ టూర్.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్
దిశ, పాలేరు: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం ముదిగొండ మండల పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముదిగొండ, నేలకొండపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. సోమవారం ముదిగొండ, పమ్మి, చిరుమర్రి, వల్లభి గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠ దామలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించడానికి వస్తున్నారనే సమాచారం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారనే తమను అరెస్టు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారనే సమాచారంతో ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్, మాజీ జడ్పిటిసీ బుల్లెట్ బాబు వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు పర్చలేక ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అరెస్టైన వారిలో మల్లెల అజయ్, ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు ఉసికెల రమేష్, మైనార్టీ నాయకుడు షేక్ నాగుల్ మీరా, యూత్ కాంగ్రెస్ నాయకుడు గొట్టెముక్కుల ఉపేందర్ లను అరెస్ట్ చేసి ముదిగొండ పోలీస్ స్టేషన్ కు , జెర్రిపోతుల అంజనిని నేలకొండపల్లి స్టేషన్ కి తరలించారు.