- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముత్తిరెడ్డిని గాంధీకి తరలించాలి: వంశీచంద్‌రెడ్డి

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరోనా బారిన పడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని గాంధీ ఆస్పత్రికి తరలించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదోడికి అన్యాయం… పెద్దోడికి న్యాయం అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పాలన చేపడుతుందని మండిపడ్డారు. సర్కార్ పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, ధనవంతుల జీవితాలను కాపాడేందుకు తాపత్రయ పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన దారికి శాంతియాత్ర వేదికలా గాంధీ ఆస్పత్రిని చేశారని ఆరోపించారు. పేద ప్రజల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని అంతా గమనిస్తున్నారన్నారు.
Next Story