నాకు రూ. లక్షా 5 వేల కరెంట్ బిల్లు వచ్చింది: షబ్బీర్ అలీ

by Anukaran |   ( Updated:2020-07-06 00:54:27.0  )
నాకు రూ. లక్షా 5 వేల కరెంట్ బిల్లు వచ్చింది: షబ్బీర్ అలీ
X

దిశ, వెబ్ డెస్క్: నాకు నెలకు రూ. 45 వేల విద్యుత్ బిల్లు రావాలి.. కానీ, రూ. లక్షా 5 వేల విద్యుత్ బిల్లు వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లుల విషయమై ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ నిర్లక్షాన్ని వీడనాడలన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారని, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదన్నారు. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story