- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుస్నాబాద్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేత మెసేజ్.. 15 రోజుల్లో ఆ పని చేయాలంటూ..!
దిశ, హుస్నాబాద్: సమస్యలు తీర్చాలంటూ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు మెసేజ్(ఎస్ఎంఎస్)చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు అక్కు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. నాగారం రోడ్డులోని మారుపక రాజయ్య విగ్రహం నుంచి స్థూపం వరకున్న ప్రధాన రహదారి గుంతలమయం అయిందన్నారు. రోడ్లకు గుంతలు ఏర్పడడంతో దుమ్ము, ధూళితో ప్రయాణికులు, పాదాచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. రోడ్డుల మరమ్మతులు చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏడేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తున్నప్పటికీ నిమ్మకునిరేత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సిద్దిపేట ప్రధాన రహదారి గుంతల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాలను పాతి నిరసన తెలపడం ద్వారానే రోడ్డుకు శాశ్వత పరిష్కారం జరిగిందన్నారు. వచ్చే 15రోజుల్లో నూతన రోడ్లు వేయకుంటే గతంలో మాదిరిగా టీఆర్ఎస్ జెండాలు పాతెస్తామని.. స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావులకు సెల్ ఫోన్ నుంచి మెసేజ్(ఎస్ఎంఎస్) ద్వారా సమాచారం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.