రాఫెల్స్ రాక మావల్లే: కాంగ్రెస్

by Shamantha N |
రాఫెల్స్ రాక మావల్లే: కాంగ్రెస్
X

దిశ, వెబ్ డెస్క్: రాఫెల్స్ యుద్ధ విమానాల రాక సందర్భంగా కాంగ్రెస్ స్పందించింది. 2012లో తాము అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగానే నేడు ఐదు యుద్ధ విమనాలు భారత్ చేరుకున్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా మరోసారి ప్రధాని మోదీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

రాఫెల్స్ జెట్ పైటర్ సామర్థ్యం అంచనా వేసే అప్పటి తమ ప్రభుత్వం 126 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే.. ప్రస్తుతం బీజేపీ ఆ ఒప్పందాన్ని 36 జెట్లకే కుదుర్చుకుందని విమర్శలు గుప్పించింది. దేశ రక్షణ విషయంలో తమకు బీజేపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో మరోసారి రుజువైందని కాంగ్రెస్ పేర్కొంది. నాటి డీల్ ప్రకారం అయితే నేడు 126 జెట్లు భారత అమ్ముల పొదిలోకి చేరి ఉండేవని, మరో 108 విమానాలు మన దగ్గరే తయారై ఉండేవని, 2016 నాటికే అన్ని విమానాలు వైమానిక దళంలో చేరి ఉండేవని పేర్కొంది.

Advertisement

Next Story