వరద బాధితులకు నగదు పంపిణీలో గొడవ

by Shyam |
వరద బాధితులకు నగదు పంపిణీలో గొడవ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వరద బాధితులకు పరిహారం పంపిణీ రాజకీయ దుమారం రేపుతోంది. శుక్రవారం గోషామహల్‌ నియోజకవర్గంలో బాధితులకు రూ.10వేల పరిహారం అందించే కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. అయితే టీఆర్ఎస్ నేతలు అపార్ట్‌మెంట్లలో పై అంతస్థుల్లో ఉన్నవారిని లబ్దిదారులుగా గుర్తించేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ నేతలు గొడవకు దిగారు. దీంతో కొంతమందికి మాత్రమే పరిహారం అందజేసిన మంత్రి తలసాని, మిగతా బాధ్యతను అధికారులకు అప్పగించి వెళ్లారు. ఇదేక్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు కారణం కావడంతో ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలు చేసుకున్నారు. వెంటనే పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పి లబ్దిదారులకు నగదు పంపిణీ జరిగేలా చేశారు.

సర్వే ప్రకారమే పంపిణీ చేస్తున్నాం
వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అధికారుల బృందం పర్యటించి నష్టపోయిన వారిని మాత్రమే గుర్తించడం జరిగింది. ఎంపిక చేసే సమయంలో వీడియోలు, ఫోటోలు కూడా తీశాం. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా బాధితులను ఎంపిక చేసి నగదు పంపిణీ చేస్తున్నామని జీహెచ్ఎంసీ సర్కిల్ 14 అధికారి వినయ్ కపూర్ తెలిపారు.

Advertisement

Next Story