అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో ఉద్రిక్తత

by srinivas |
అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో ఉద్రిక్తత
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద బుధవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతికి శంకుస్థాపన చేసి గురువారానికి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించిన రైతులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పోలీసులు, రైతులకు వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ జెప్పడంతో వెళ్లిపోయారు.

Advertisement

Next Story