- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా తగ్గనే లేదు.. కానీ కండోమ్స్ కోసం ఎగబడుతున్న కుర్రాళ్లు
దిశ, వెబ్ డెస్క్: గతేడాది నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ వైరస్ వలన అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. పలు కంపెనీలకు కరోనా కాలంలో కొనుగోళ్లు కూడా తగ్గాయి. వాటిలో కండోమ్స్ ఒకటి. కరోనా కారణంగా వీటి కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఎక్కడ సెక్స్ చేస్తే కరోనా అంటుకుంటుందో అని యువత శృంగారానికి దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కండోమ్స్ కొనుగోళ్లు పుంజుకున్నాయని కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. చైనా, అమెరికా దేశాల్లో జనాభా ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే కండోమ్స్ వినియోగం కూడా ఎక్కువే.. కానీ కరోనా సమయంలో మాత్రం వీటికి డిమాండ్ లేకపోవడంతో స్టాక్ మిగిలిపోయి చెత్తకుప్పలో పడేశారు. అయితే ఇంకెన్నాళ్లు ఇలాగే ఉండాలి.. ఏది అయితే అది అయిందని చాలామంది యువత శృంగారం వైపు మొగ్గు చూపుతున్నారట. ఈ నేపథ్యంలోనే చైనా, అమెరికా దేశాల్లో కండోమ్స్ వినియోగం మళ్లీ మొదలయిందని కండోమ్స్ తయారీ కంపెనీలు తెలుపుతున్నాయి.
అంతేకాకుండా ప్రస్తుతం అందరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.. వ్యాక్సిన్ తీసుకున్నాక ఆగాల్సిన అవసరం ఏముంది? అనే భావనలో కూడా యువత ఉందని, అందుకే ఏడాది నుండి ఎదురుచూస్తున్నవారు శృంగారానికి సై అంటున్నారని తెలిపింది. ఎక్కువగా 18 నుంచి 24 ఏళ్ల వయసు వారు కండోమ్స్ కొనుగోలు చేస్తున్నారని, కరోనా వల్ల ఏడాదిగా నష్టాల్లో కూరుకుపోయిన కండోమ్ కంపెనీలు ఇప్పుడు తాము మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోందని అంటున్నాయి. అటు ఇతర దేశాలతో పాటు, ఇండియాలో కూడా మెల్లగా కండోమ్స్ వాడకం పెరుగుతుందని కండోమ్ కంపెనీలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నవారు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువగా కండోమ్స్ ని వాడడానికి ఇష్టపడుతున్నారని తెలిపింది. ఈ కరోనా కొంచెం తగ్గు ముఖం పట్టినా తమ కంపెనీలు మళ్లీ పూర్వదశకు చేరుకొంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.