ఇలా ఎందుకు చేస్తున్నారు.. దుబ్బాక‌ దళితుల ఆవేదన

by Shyam |   ( Updated:2021-08-05 07:56:53.0  )
ఇలా ఎందుకు చేస్తున్నారు.. దుబ్బాక‌ దళితుల ఆవేదన
X

దిశ, దుబ్బాక : ఎన్నికలప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేశారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయిస్తామన్న ప్రభుత్వ స్థలంలో పార్క్ ఏర్పాటు చేసి ఆ భూమిని కేటాయిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో దళితులకు 3 ఎకరాల భూమిలో భాగంగా ఒక వర్గానికి మాత్రమే 18 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని దళితులు వాపోయారు. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతల‌ దృష్టికి తీసుకెళ్లడంతో.. తమకు కూడా 20 ఎకరాల భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు ఆ స్థలాన్ని పార్కు ఏర్పాటు కోసం కేటాయిస్తామని అధికారులు తెలపడం శోచనీయంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు కేటాయిస్తామన్నా భూమిని కేటాయించాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమకు కేటాయిస్తామన్న భూమిలో ఆ వర్గానికి చెందిన దళితులు భూమిని చదును చేశారు.

Advertisement

Next Story

Most Viewed