‘దిశ’ కథనానికి చలించి.. సింగరేణి సీఎండీకి ఫిర్యాదు

by Sridhar Babu |   ( Updated:2021-12-27 11:51:25.0  )
disha
X

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికుల ఆత్మహత్యలపై ‘దిశ’ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. మెడికల్ అన్ ఫీట్ పేరుతో జరుగుతున్న ఈ దందాపై ప్రత్యేక కథనం వచ్చింది. కారుణ్య నియమకాల కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ కార్మికుల కుటుంబాల బాధలను ‘దిశ’ కళ్లకు కట్టింది. ‘‘సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ దందా.. ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికులు’’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. ఈ కథనానికి చలించిన ఏఐవైఎఫ్ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ట్విట్టర్ ద్వారా సింగరేణి సీ అండ్ ఎండీతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మెడికల్ ఇన్వల్ డేషన్‌లో అక్రమాలు వెలికి తీయాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోని, కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలపై వెలుగులోకి తెచ్చిన ‘దిశ’కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story