గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఫిర్యాదు

by Sumithra |
RS Praveen Kumar
X

దిశ, జనగామ: అడిషనల్ డీజీపీ, తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జనగామ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. వివరాళ్లోకి వెళితే.. హిందూ దేవుళ్లను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఫిర్యాదు అందించారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story