ప్లాస్టిక్ వాడకంపై  కమిషనర్ సీరియస్…

by Shyam |
Plastic Use
X

దిశ, మేడ్చల్: స్వచ్చ్ సర్వేక్షన్ 2022 లో భాగంగా కమిషనర్ అహ్మెద్ షఫీ యూ ల్లాహ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందితో ప్లాస్టిక్ నిషేధం పై పారిశుద్ధ్య కార్యాలయం నుండి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వ్యాపారస్తులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించరాదని, ఉపయోగించే వ్యాపారస్తులకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారస్తులందరూ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తలను మూడు చెత్త బుట్టలలో వేరు వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు. వీధి వర్తకులు చెత్తను రోడ్లపై పారవేయకుండ, మున్సిపల్ వాహనాలకు అందించి స్వచ్చ మేడ్చల్‌‌‌‌‌‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రామచందర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అఖిల్ కుమార్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed