ఆ 12మంది అధికారులపై చర్యలు తీసుకోండి..

by Shyam |   ( Updated:2020-07-31 12:01:50.0  )

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఫిల్టర్ ఇసుక అక్రమ రవాణా విషయంపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు తీవ్రంగా స్పందించారు. ఇందుకు బాధ్యులైన 12 మంది అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఆయన రంగం సిద్ధం చేశారు. అంతేకాక ఈ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని లేఖ ద్వారా జిల్లా ఎస్పీని కోరారు.

తిరుమలాపూర్ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు తహసీల్దార్లు, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మరో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఆరుగురు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లపై చర్యలు తీసుకునేందుకు ఆయన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాజాపూర్ మండలం తిరుమలాపూర్ ఫిల్టర్ ఇసుక అక్రమ రవాణా కేసులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed