‘రైతులకు అన్యాయం జరిగితే సహించను’

by Shyam |
‘రైతులకు అన్యాయం జరిగితే సహించను’
X

దిశ, నిజామాబాద్: రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. దోమకొండ మండలం ముత్యంపేటలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. గత ఏడాది జిల్లాలో 230 కొనుగోలు కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్యను 320 కి పెంచుతున్నట్టు చెప్పారు. గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాతనే విక్రయ కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ఏఈఓలు రైతులకు టోకెన్ ఇచ్చి విక్రయ కేంద్రానికి ధాన్యాన్ని తీసుకు వచ్చే విధంగా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకార సంఘం అధికారులు చూడాలని కోరారు. ధాన్యం విక్రయించిన రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలు ఇస్తే వారి అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తామని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అని స్పష్టం చేశారు.

Tags : collector, opened, grain buying center, nizamabad, formers, kamareddy



Next Story