- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మీరు త్వరత్వరగా ఆ డీటెయిల్స్ ఇవ్వండి'
దిశ, మహబూబ్ నగర్: త్వరత్వరగా నాకు ఆ డీటెయిల్స్… ఈ డీటెయిల్స్ ఇవ్వండి. వాటి ఆధారంగా డబ్బులు జమ చేయాల్సి ఉంటుందని నిర్వహించిన సమీక్షలో ఆమె చెప్పుకొచ్చారు. విషయమేమిటంటే.. రుణమాఫీ పథకంపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల జాబితాను సాధ్యమైనంత తొందరగా రూపొందించి సమర్పించాలని ఆమె బ్యాంకర్లను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు పొందిన రైతులకు సంబంధించి రూ. 25,000 లోపు రుణాలు పొంది అర్హులైన రైతుల రుణాలను ఒకేసారి నేరుగా రైతు లోన్ అకౌంట్లో ఆన్ లైన్ ద్వారా నగదు జమ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. లక్ష రూపాయల లోపు రుణం పొందిన రైతుల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రైతుల ఆధార్ డేటా ఆధారంగా రుణమాఫీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి వనపర్తి జిల్లాలో రూ. 25,000 లోపు రుణాలు పొందిన రైతుల జాబితా, లక్ష రూపాయల లోపు రుణాలు పొందిన రైతుల జాబితా వేర్వేరుగా తయారు చేసి వెంటనే సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఈ డేటా ను వ్యవసాయశాఖ పోర్టల్ లో పొందుపరుస్తామని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతు లోన్ అకౌంట్ లో నగదు జమచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.