- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల జమున ఆరోపణలపై స్పందించిన కలెక్టర్.. కీలక వివరాలు వెల్లడి
దిశ, మెదక్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలను మెదక్ కలెక్టర్ హరీశ్ ఖండించారు. సోమవారం ఈటల సతీమణి జమున మెదక్ కలెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సర్వే నెం.81లో భూమి వివరాలు తప్పుగా వెల్లడించారని జమున ఆరోపించగా.. స్పందించిన కలెక్టర్ అచ్చంపేటలోని సర్వే నెం.81లో జమున హ్యాచరీస్ యాజమాన్యం కబ్జాలు, అసైన్ దారులకు కేటాయించిన భూ వివరాలు వెల్లడించారు.
కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెం.81లో మొత్తం ప్రభుత్వ భూమి, అసైన్డ్ విస్తీర్ణం 14.05 ఎకరాల భూమిని జమున హ్యాచరీస్ యాజమాన్యం అక్రమంగా అక్రమించారన్నారు. సర్వే నెం.81లో కుయ్య బాలరాజు, పెరికె రామవ్వ, కత్తెర పోచయ్య, మత్తడి సిద్దిరాములు, దుర్గం భిక్షపతి, జవ్వాడి నారాయణ, మత్తడి మాణిక్యం లకు కేటాయించినపట్టికీ వారికి చెందిన భూమిలో జమున హ్యాచరీస్ ద్వారా పిల్లర్ స్ట్రక్చర్, రోడ్లు వేశారన్నారు. భూమి లేని పేదలకు ఇచ్చిన అచ్చంపేటలోని సర్వే నెం.81లో అసైన్డ్ భూమిని జమున హ్యాచరిస్ అక్రమంగా అక్రమించిందని కలెక్టర్ వివరించారు.