- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘హరితహారంలో నిర్లక్ష్యాన్ని సహించను’
by Sridhar Babu |
X
దిశ, కొత్తగూడెం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు మొక్కలు నాటాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఆయా శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను ఆయన ప్రకటించారు. ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే మొక్కలు నాటేందుకు సమయం ఉన్నందున మొక్కలు నాటడం మిషన్ మోడ్‌లో చేపట్టాలని అన్నారు. నిర్లక్ష్యంతో వెనుకంజలో ఉన్న అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లక్ష్య సాధనలో అలసత్వం వహించడంపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్టు ఆయన చెప్పారు. నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేయడం వల్ల జవాబుదారీతనం ఉంటుందని చెప్పారు.
Advertisement
Next Story