- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరి గిట్లజేస్తే కలెక్టర్‌కు కోపం రాదా?

దిశ, ఖమ్మం: కరోనా వస్తుంది మాస్కులు లేకుండా బయటకు పొవొద్దు మొర్రో అని అధికారులు మొత్తుకుంటున్నా యూత్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. గింత కూడా పట్టనట్లు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనా అయితేంది అన్న ఫీలింగ్ ఉంటున్నారు. ఇటువంటి వారు కంటపడితే పోలీసులు, అధికారులు కొరడా ఝులిపిస్తున్నప్పటికీ.. లెక్క చేయకుండా మళ్లీ అదే పని చేస్తున్నారు. దీంతో ఓ కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆ జిల్లాలో పర్యటన చేస్తూనే వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. మాస్కులు ధరించకుండా వాహనాలపై తిరుగతున్న యువతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు వాహనాలను కూడా సీజ్ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి గురువారం సుజాత్‌నగర్ మండలంలో పర్యటించారు. అక్కడ మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చిన యువతను మందలించి.. బండ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, పరిమితికి మించి ఓ వాహనంలో మూగజీవాలను తరలిస్తున్న డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.