- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ ఇబ్బందులకు కంట్రోల్ రూం
by Kalyani |

X
దిశ, సంగారెడ్డి : రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లలో, ప్రజా సంక్షేమ పథకాల సమస్యల పరిష్కారనికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇల్లు, ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి ఎద్దడి నివారణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలైన రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ లో ఇబ్బందులు తలెత్తితే, ఇందిరమ్మ ఇళ్లపై ఏదైనా సమస్యలు ఉంటే, ఎల్ఆర్ఎస్, తాగునీటి సమస్యలు తలెత్తితే గ్రీవెన్స్ సెల్ నంబర్ 08455- 276155 నెంబర్ కు డయల్ చేసి సమస్యల పరిష్కరించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు. కార్యాలయ పని వేళల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Next Story