దసరా నాటికి… వందశాతం పూర్తి చేయాలి

by Aamani |   ( Updated:2020-08-24 11:02:42.0  )
దసరా నాటికి… వందశాతం పూర్తి చేయాలి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రైతు వేదికల నిర్మాణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల, గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ…

జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేసి, దసరా నాటికి వందశాతం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతు వేదికల ప్రాంగణం సుందరంగా కనిపించేలా విభిన్న ఆకృతులకు ప్రాధాన్యతనిస్తూ, పచ్చదనం కనిపించేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, పంచాయతీ రాజ్ ఈఈ సుదర్శన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed