పల్లె ప్రగతికి పట్టం: కలెక్టర్ ముషారఫ్ అలీ

by Shyam |
పల్లె ప్రగతికి పట్టం: కలెక్టర్ ముషారఫ్ అలీ
X

పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డులు, స్మశానవాటికల నిర్మాణ పనులు సోమవారం నుంచి తప్పనిసరిగా మొదలు పెట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీడీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలకు స్థలం లేని గ్రామాల్లో యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకొని.. సోమవారం నుంచి డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల కోసం తహసీల్దార్ నుంచి భూములను సేకరించి పనులను చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఈ నెల 20లోపు అన్ని గ్రామ పంచాయతీలకు చెత్తను తీసుకెళ్లేందుకు.. ట్రాక్టర్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. మండల ప్రజా పరిషత్ అధికారి ప్రతి గ్రామాన్ని వారంలో ఒకరోజు సందర్శించాలన్నారు. ఈనెల 18న జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed