- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయం పొందని వలస కూలీలను గుర్తించాలి: కలెక్టర్
దిశ, వరంగల్: ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సహాయం పొందని వలస కూలీలను త్వరగా గుర్తించి వారికి సహాయం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో వలస కూలీలకు ప్రభుత్వం తరపున సహాయం అందించి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో ఎలా పొందుపరచాలో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ప్రభుత్వ ఆదేశాలతో మొదటి విడతగా బియ్యం, నగదు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా కొంత మంది వలస కూలీలకు ప్రభుత్వ నుంచి సహాయం అందలేదని చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించి సహాయం అందించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Tags: Collector Mohammed Abdul Azim, meeting, help, Migrant laborers, bhupalapalli
Advertisement
Next Story