- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోల్ ఇండియా లాభాలు రూ. 4,587 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్య సంస్థ కోల్ ఇండియా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన త్రైమాసికానికి లాభాలు 1.1 శాతం క్షీణించి రూ. 4,586.78 కోట్లుగా నమోదు చేసింది. తక్కువ అమ్మకాల కారణంగానే లాభాలు క్షీణించాయని సంస్థ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ. 4,637,95 కోట్ల లాభాలను ఆర్జించింది. జనవరి-మార్చి మధ్య కాలంలో అమ్మకాల రూ. 24,510.80 కోట్లకు తగ్గాయని, అంతకుముందు ఇదే ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 25,597.43 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఖర్చులు రూ. 21,565.15 కోట్లకు తగ్గినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ లాభాలు 23.9 శాతం క్షీణించి రూ. 12,20 కోట్లుగా నమోదైంది.
సంస్థ ఆదాయం 8.5 శాతం క్షీణించి రూ. 93,818 కోట్లుగా ఉండగా, కార్యకలాపాల ఆదాయం 6.3 శాతం తగ్గి రూ. 90,026 కోట్లుగా నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ అమ్మకాలు రూ. 82,710 కోట్లకు తగ్గాయని వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌కు రూ. 3.50 తుది డివిడెండ్‌ను కోల్ ఇండియా బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఉత్పత్తి 203.42 మెట్రిక్ టన్నులకు తగ్గింది. కాగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80 శాతంగా ఉంది. దీన్ని 2023-24 నాటికి వంద కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించాలని సంస్థ లక్ష్యంగా ఉంది.