- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐడీకి సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్..!
దిశ, వెబ్‌డెస్క్:
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కామ్ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో లబ్దిదారులకు జారీ చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఫ్యాబ్రికేట్ చేసి నకిలీ చెక్కులను సృష్టించి డబ్బులను డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. సెక్రటేరియట్‌లోని రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో జారీ చేసిన చెక్కులకే నకిలీగా తయారు చేసి కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ బ్రాంచీల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు యత్నించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే డబ్బులు డ్రా చేశారు. ఒక్క చెక్ డ్రా చేయలేదు. రెండు రోజుల క్రితం 45 వేలను డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్రటేరియట్ ఎస్బీఐ బ్యాంకులో చెక్‌ను క్లియర్ చేసే విషయంలో అనుమానించాడు. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థ పేరున సీఎంఆర్ఎఫ్ చెక్ రావడంపై ఎస్బీఐ అధికారులకు అనుమానం రావడంతో రెవెన్యూ అసిస్టెంట్ సెక్రటరీ వద్దకు చెక్‌ను పంపారు. అయితే చెక్ పై ఉన్న సంతకం కూడా తనది కాదని రెవెన్యూ అధికారి చెప్పడంతో చెక్‌ను క్లియర్ చేయలేదు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
సచివాలయంలో విచారణ చేపట్టిన తుళ్లూరు పోలీసులు.. రెవెన్యూ శాఖలోని CMRF విభాగం అధికారులతోపాటు ఎస్బీఐ బ్రాంచి అధికారులను ప్రశ్నించారు. ఇక్కడ ఉద్యోగుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం, కడప జిల్లా పొద్దుటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన బాధితుల పేరిట జారీ అయిన మూడు చెక్కులను ఫోర్జరీ చేసినట్టు గుర్తించారు. గతంలోనూ నకిలీ చెక్కులతో లక్షల్లో డబ్బులు డ్రా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరోవైపు మూడు రాష్ట్రాల పరిధిలో కేసులు ఉండడంతో సీఐడీకి బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.