- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే నెలలో 2 కోట్ల మందికి ఉపాధి!
దిశ, సెంట్రల్ డెస్క్: భారతదేశ నిరుద్యోగిత రేటు మే నెలలో 23.5 శాతంగా ఉంది. ఇది కరోనా వైరస్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమైఈ) గణాంకాలు వెల్లడించింది. అయితే, నిరుద్యోగ రేటు ఆ స్థాయిలో ఉన్నప్పటికీ 2.1 కోట్ల మందికి ఉపాధి లభించిందని సీఎమైఈ పేర్కొంది. రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగాలు పొందడమే కాకుండా కార్మిక భాగస్వామ్య రేటు గణనీయంగా మెరుగైందని పేర్కొంది. లాక్‌డౌన్ సడలింపుల వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలు మళ్లీ పునఃప్రారంభమవడంతో మే నెలలో 1.44 కోట్ల మందికి ఈ సంస్థల్లో ఉపాధి లభించినట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మేలో ఉపాధి 7.5 శాతం పెరిగింది. నిరుద్యోగ రేటు అత్యధికంగా 23.5 శాతం ఉన్నప్పటికీ కార్మిక భాగస్వామ్యరేటు 38.2 శాతానికి, ఉపాధి రేటు 29.2 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ చీఫ్ మహేష్ వ్యాస్ వివరించారు. అయితే, లాక్‌డౌన్ కాలంలో నాణ్యమైన ఉద్యోగాలను కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన స్పష్టం చేశారు.