అలాంటి ఖైదీల విడుదలకు సీఎం ఆదేశం

by Shyam |
అలాంటి ఖైదీల విడుదలకు సీఎం ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: మంచి ప్రవర్తన కల్గిన ఖైదీలను ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేస్తుంటారు. తెలంగాణలో కూడా మంచి ప్రవర్తన కల్గిన ఖైదీలను ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed